కౌడిపల్లి(నర్సాపూర్): మండల కేంద్రమైన కౌడిపల్లి బతుకమ్మతండాకు చెందిన మెగావత్ పకీరనాయక్(104) బుధవారం రాత్రి అస్వస్థతకుగురై మృతి చెందా రు. తన పనులు తాను చేసుకుంటు ఆరోగ్యంగా ఉన్న అతను అస్వస్థతకు గురై మృతి చెందారు. అతనికి భార్య మాలి, ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లతో పాటు అయిదు తరాలకు చెందిన మునిమనుమలు, మనుమరాళ్లు ఉన్నారు. గురువారం అతని అంత్య క్రియలు తండాలో నిర్వహించారు. ఆయన తండావాసుల ఐక్యత, అభివృద్ధి కోసం కృషి చేశారని స్థానికులు కొనియాడారు.


