ఉద్యాన వర్సిటీ వీసీ రాజిరెడ్డి
ములుగు(గజ్వేల్): ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని, సాగు విస్తీర్ణం పెరగాలని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిదాయలయం వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్.రాజిరెడ్డి అన్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో కూరగాయల సాగులో అనుసరించాల్సిన పద్ధతులపై ముల్కనూరు రైతులకు గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయం పరిధిలోని 24 గ్రామాలలో ఇప్పటికే 750 మంది రైతులకు శిక్షణనిచ్చామన్నారు. రాజేంద్రనగర్ కూరగాయల రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త శ్రీనివాస్, పరిశోధకురాలు నిరోష, శాస్త్రవేత్తలు లావణ్య, సురేశ్‌కుమార్ తదితరులు ఎల్‌నినో ప్రభావం, నాణ్యమైన నారుమడి తయారీ, యాజమాన్య పద్ధతులపై రైతులకు శిక్షణనిచ్చారు. అనంతరం క్షీరసాగర్‌లో సర్పంచ్ బాల్‌రెడ్డి, ఉపసర్పంచ్ పరశురాం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్షేత్ర ప్రదర్శనకు రైతులను తీసుకెళ్లి అవగాహన కల్పించారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ
కార్యదర్శి తరణి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విద్యార్థులకు హక్కులు, అదేవిధంగా బాధ్యతలు కూడా ఉంటాయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి తరణి అన్నారు. స్థానిక బీసీ గురుకుల పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఽఆధ్వర్యంలో గురువారం చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగం, చట్టాలపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంచుకోవాలన్నారు. విద్యను ఆయుధంగా చేసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అసిస్టెంట్ రవికుమార్, టూటౌన్ సీఐ మురళి, అసిస్టింట్ ప్రిన్సిపాల్ సాజిద్ తదితరులు పాల్గొన్నారు.
పటాన్‌చెరుటౌన్: ఒక యువకుడి ఇంటి ఎదుట గర్భిణి నిరసన వ్యక్తం చేసిన ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. పటాన్‌చెరు నాయికోటి బస్తీకి చెందిన శ్రవణ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఆయువతి ఆరోపించింది. దీంతో శ్రవణ్ కుటుంబ సభ్యులు 112కు ఫోన్ చేయడంతో పటాన్‌చెరు పోలీసులు వచ్చి యువతిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీనిపై పోలీసులను వివరణ కోరగా గతంలో చందానగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైందని, కోర్టులో కేసు నడుస్తోందని చెప్పారు. యువతికి సర్ది చెప్పడంతో వెళ్లిపోయిందని తెలిపారు.
వివాహిత అదృశ్యం
నర్సాపూర్‌రూరల్: వివాహిత అదృశమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నర్సాపూర్ ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని ఖాజీపేటకు చెందిన పల్లె నరేశ్ భార్య నందిని బుధవారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. దీంతో నరేశ్, కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద వెతికినా ఎలాంటి ఆచూకీ తెలియరాలేదు. గురువారం భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నందిని ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె పింక్ కలర్ చీర, బ్లౌజ్ ధరించి ఉందని, ఎవరికై నా ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.
రేషన్ బియ్యం పట్టివేత
రామచంద్రాపురం(పటాన్‌చెరు): హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాలశాఖ అధికారులు, పోలీసులు పట్టుకున్న ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం మేరకు పౌరసరఫరాల అధికారులు, కొల్లూర్ పోలీసులు కలిసి కొల్లూర్ రింగ్‌రోడ్డుపై గురువారం ఒక లారీని ఆపి తనిఖీ చేశారు. లారీలో 335 క్వింటాళ్ల బియ్యాన్ని సాధ్వీనం చేసుకున్నారు. ఆ బియ్యం విలువ సుమారు రూ.10.8 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. బియ్యాన్ని పటాన్‌చెరు సివిల్ సప్లయ్ గోదాముకు తరలించి లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో డీటీసీఎస్ అనూప్, ఎస్‌ఐ రాంబాబు పాల్గొన్నారు.


