‘బెల్ట్’ తీసేదెవరు?
చిన్నకోడూరు(సిద్దిపేట): కంచే చేను మేసినట్లు అక్రమ మద్యాన్ని అడ్డుకోవాల్సిన అధికారులు అక్రమార్కులకే రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో ప్రజలంతా ఏకమై మద్యపాన నిషేధం అమలు చేయడానికి తీర్మానించారు. అక్రమ బెల్ట్‌షాపులను మూసివేయించారు. ఎవ్వరూ అక్రమంగా మద్యం అమ్మవద్దని, అమ్మితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి ప్రతిజ్ఞకు ఎకై ్సజ్ అధికారులు రక్షణగా ఉండాల్సింది పోయి అక్రమ మద్యం దుకాణాలకు అండగా నిలుస్తున్నారని ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులకు మొరపెట్టుకుంటే ఎకై ్సజ్ అధికారులు చూసుకుంటారని చెప్పి చేతులెత్తేశారు.
మహిళల ఆవేదన
రామంచ గ్రామంలో 17 బెల్ట్‌షాపులు కొనసాగుతున్నాయి. మద్యం అమ్మకాలు జరపవద్దని 15 రోజుల క్రితం గ్రామస్తులతో కలిసి పాలకవర్గం సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఎకై ్సజ్, పోలీసు అధికారులకు తీర్మాన పత్రాలను అందజేశారు. కొద్దిరోజులు సజావుగానే సాగినా తిరిగి మద్యం అమ్మకాలు జోరు పెరిగిపోయింది. దీంతో గ్రామంలో అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోయాయి. దీంతో పాలకవర్గం, గ్రామ పెద్దలు కలిసి ఎకై ్సజ్ అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందజేశారు. అయినా ఫలితం లేదని పలువురు వాపోతున్నారు. బెల్ట్ దుకాణాలు మూసి వేయించాలని పోలీసులకు మొరపెట్టుకుంటే ఇది ఎకై ్సజ్‌శాఖ అధికారులు చూస్తారంటూ దాటవేసినట్టు సమాచారం. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మద్యం షాపులను మూసివేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్‌ను వివరణ కోరగా ఇటీవలే తన దృష్టికి వచ్చిందని, వెంటనే గ్రామంలోని బెల్ట్ షాపులు మూసి వేయిస్తానని చెప్పారు.
మద్యపాన నిషేధానికి గ్రామస్తుల తీర్మానం
అక్రమార్కులకే అధికారుల అండ
రామంచ గ్రామస్తుల విమర్శలు


