వ్యసనాలకు బానిసై బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

వ్యసనాలకు బానిసై బలవన్మరణం

Aug 7 2026 6:28 AM | Updated on Aug 7 2026 6:28 AM

వ్యసనాలకు బానిసై బలవన్మరణం

కొల్చారం(నర్సాపూర్‌): వ్యసనాలకు బానిసైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో రంగంపేటలో గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ హైమద్‌ మొహినొద్దీన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వేముల లింగం యాదమ్మల రెండో కుమారుడు వేముల కుమార్‌(29) ఒక ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లో మాస్టర్‌గా పనిచేసేవాడు. అయితే ఏడాదిగా పని మానేసి మద్యానికి బానిసయ్యాడు. దీనికి తోడు పెళ్లి సంబంధాలు రాకపోవడంతో కొంతకాలంగా తీవ్ర మనస్థాపానికి లోనవుతూ వచ్చాడు. బుధవారం రాత్రి భోజనం చేసి తన గదిలో పడుకున్నాడు. ఉదయం కుటుంబ సభ్యులు గది తలుపు తెరిచి చూడగా కుమార్‌ గదిలోని సీలింగ్‌కు చీరతో ఉరి వేసుకుని విగత జీవిగా కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement