ఆత్మరక్షణకు తైక్వాండో దోహదం | - | Sakshi
Sakshi News home page

ఆత్మరక్షణకు తైక్వాండో దోహదం

Aug 6 2026 8:08 AM | Updated on Aug 6 2026 8:08 AM

ఆత్మరక్షణకు తైక్వాండో దోహదం

పటాన్‌చెరుటౌన్‌: విద్యార్థులకు తైక్వాండో పోటీలు స్వీయ రక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఎంతో దోహదపడతాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజి రెడ్డి అన్నారు. ఆర్జిన్‌ స్కూల్‌ వేదికగా సీబీఎస్‌ఈ సౌత్‌జోన్‌–1లో నిర్వహించిన పోటీలను బుధవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణించే అవకాశాలను కల్పిస్తాయన్నారు. ఆ స్కూల్‌ చైర్మన్‌ ప్రమోద్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలకు సీబీఎస్‌ఈ అబ్జర్వర్‌ దురై హాజరయ్యారు. ఆల్ఫా స్పోర్ట్స్‌, మార్షల్‌ ఆర్ట్స్‌ అకాడమీ డైరెక్టర్లు వెంకటేశ్‌, రాంబాబు పోటీల నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. ఈ పోటీలు 8వ తేదీ వరకు జరగనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్‌–నికోబార్‌ దీవుల నుంచి సుమారు 3 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి జాతీయస్థాయి పోటీలకు సిద్ధం చేయడమే ఈ ఛాంపియన్‌షిప్‌ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

5 రాష్ట్రాల నుంచి మూడు వేల మంది హాజరు

పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement