ప్రభుత్వ బాలుర పాఠశాల ఆవరణలో నిలిచిన నీరు
సంగారెడ్డి క్రైమ్: గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల ఆవరణ చెరువును తలపిస్తోంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తరగతి గదిలోకి వెళ్లాలన్నా వర్షం నీటిలో నుంచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. నీరు నిలిచి ఉండటంతో మధ్యాహ్న భోజనం సైతం చేయలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనార్యోగం బారిన పడుతున్నామని వాపోతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.


