దశాబ్దాల వివాదమిది | - | Sakshi
Sakshi News home page

దశాబ్దాల వివాదమిది

Apr 12 2026 6:35 AM | Updated on Apr 12 2026 6:35 AM

పటాన్‌చెరు: అమీన్‌పూర్‌ పరిధిలోని ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు కలకలం రేపింది. హైడ్రా కూల్చి వేసిన ప్రాంతం దశాబ్దాలుగా వివాదంలో ఉంది. ఒకప్పుడు ఐలాపూర్‌ నిజాం సర్ఫేఖాస్త్‌ భూమిగా ఉండేది. 1,263 ఎకరాల ఆ భూమి పూర్తిగా ప్రభుత్వందేనని కోర్టుల్లో, జిల్లా రెవెన్యూ అధికారుల తీర్పులు వెలువడ్డాయి. ఆ భూమి జిల్లా రెవెన్యూ కస్టోడియన్‌ పరిధిలో ఉన్నాయి. అయితే 2003 హైకోర్టు తీర్పు ప్రకారం ఆ భూములన్నింటినీ ప్రభుత్వ భూమిగా చెప్తున్నారు. మొత్తంమీద ఆ గ్రామంలోని భూమి క్రయవిక్రయాలు జరిపేందుకు వీలులేదు. ఆ గ్రామంలో స్థానికులు మాత్రం తాము కొన్నేళ్లుగా దున్నుకుంటూ జీవిస్తున్నామని అవి తమకే దక్కుతాయని భావిస్తూ వచ్చారు. రికార్డుల పరంగా వారికి ఆ భూములు దక్కక పోవడంతో వారు కబ్జాలో ఉన్న భూములను తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. ఆ క్రయవిక్రయాలకు గ్రామంలోని అడ్వొకేట్‌ ముఖీమ్‌ సహకరిస్తున్నారు.

ముఖీమ్‌తో రంగనాథ్‌ వాగ్వాదం

ఐలాపూర్‌లోని రాజ్‌గోపాల్‌నగర్‌తోపాటు ఇతర లేఅవుట్‌లలో ప్లాట్లు కొనుగోలు చేశామని ఆ ప్లాట్లను ముఖీమ్‌ అనే వ్యక్తి కబ్జా చేశారంటూ అప్పట్లో ఆ కాలనీవాసులు దాదాపు ఏడాది క్రితం రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. ఆ లేఅవుట్‌ బాధితుల ఫిర్యాదులకు స్పందించి గ్రామంలోనే రంగనాథ్‌ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయగా..ముఖీమ్‌కు రంగనాథ్‌కు మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. అప్పట్నుంచి ఇప్పటివరకు ఏ చర్య లేకపోవడంతో హైడ్రా కూడా తమకు సాయం చేసే పరిస్థితి లేదని బాధితులు మిన్నకుండి పోయారు. తాజా కూల్చివేతల అనంతరం తమ ప్లాట్ల వద్దకు వచ్చి బాణసంచా పేల్చి మిఠాయిలు పంచి పెట్టుకున్నారు.

గుర్రపు శాలలు..

ఒకప్పుడు చిన్న గ్రామాలుగా..

ఐలాపూర్‌, ఐలాపూర్‌ తండాలు చిన్న గ్రామాలుగా ఉండేవి. అవి గ్రామాలుగా ఏర్పడేకంటే ముందుగా అక్కడున్న వారందరూ నిజాం భూములను సాగు చేసేందుకు వచ్చిన శ్రామిక కుటుంబాలని చెప్తుంటారు. నిజాం ఆ గ్రామంలోని 1,263 ఎకరాల భూమిని తన సొంత భూమిగా పేర్కొన్నారని ఆ భూమిలో సాగు చేయగా వచ్చే మొత్తాన్ని నిజాం సర్కారు ఖజానాకు కాకుండా వ్యక్తిగతంగా ఖర్చు చేసేవారని చెప్తారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ భూమిని సాగు చేసే వారిపై అజమాయిషీ చేసే వ్యక్తి ఒకరు ఆ భూమి తనదేనని చెప్తూ 475 ఎకరాలను కబ్జా చేశాడు. అయితే నిజాం ఆస్తిని తామే సాగు చేస్తున్నామని అవి తమ భూములేనని గ్రామస్తులు యాజమాన్య హక్కులు పొందే ప్రయత్నం చేశారు. అడ్వొకేట్‌ ముఖీమ్‌ కుటుంబీకులు కూడా అక్కడే నివసించే వారు. దీంతో సదరు గ్రామస్తులకు ముఖీమ్‌ పెద్ద దిక్కుగా మారారు. అయితే గ్రామస్తుల భూములన్నీ డీఆర్‌ఓ కస్టోడియన్‌ భూములుగా అధికారులు తేల్చారు. రెవెన్యూ అధికారుల ఉదాసీనత కారణంగా ఆ గ్రామంలోని రైతులు ఆ భూములను అమ్ముకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీంతో తమ పరిస్థితులు మారవని పోరాటమే శరణ్యమని భావిస్తూ సదరు గ్రామస్తులు తమ భూములను అమ్ముతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజాం ఆస్తుల పరిరక్షకుడిగా ఉన్న కుటుంబీకుల హత్య కూడా ఇక్కడ ఈ భూవివాదం నేపథ్యంలోనే జరిగింది. అప్పటి నుంచి ఆ గ్రామంవైపు ఎవరు కన్నెత్తి చూడాలన్న భయపడే పరిస్థితులు వచ్చాయి. అయితే రాజగోపాల్‌నగర్‌ ప్లాటు ఓనర్లు వివిధ స్థాయిల్లో తమ ఫిర్యాదులను చేస్తూ వస్తున్నారు. తమకు న్యాయం చేయాలని హైడ్రాను కూడా ఆశ్రయించారు. దీంతో హైడ్రా అదనుచూసి పంజా విసిరింది.

ఐలాపూర్‌లో హైడ్రా కలకలం

నిజాం సర్ఫే ఖాస్త్‌గా ఉన్న వేల

ఎకరాల భూమి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement