సంగారెడ్డి క్రైమ్: జిల్లా కేంద్రంలోని ఎంఎస్ క్రికెట్ అకాడమీలో శనివారం ఏర్పాటు చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా అండర్–25 క్రికెట్ సెలక్షన్స్‌లో 18 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ ఇండస్ట్రీస్ సౌజన్యంతో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లాల నుంచి క్రికెట్ క్రీడాకారు లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. డివిజన్ లీగ్ క్రికెట్ పోటీల విభాగంలో సెలక్షన్ చేయగా సంబంధిత క్రీడాకారులు తమ ప్రతిభతో రాణించారు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా కార్యదర్శి రాజేందర్‌రెడ్డి శనివారం మీడియాకు వెల్లడించారు. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా అసోసియేషన్ సభ్యులు, ఉపాధ్యక్షుడు మధుమోహన్‌రెడ్డి, కోచ్‌లు శ్రీనాథ్‌రెడ్డి, కలీముద్దీన్, ఇనాం, అనిల్ కుమార్, మహేందర్‌రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.
‘ఉపాధి’ పథకాన్ని
పునరుద్ధరించాలి
డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి
కొండపాక(గజ్వేల్): జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని పునరుద్ధరించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి డిమాండ్ చేశారు. కుకునూరుపల్లి మండల పరిధి కోనాయిపల్లి, మేదినీపూర్, చిన్న కిష్టాపూర్, పీటీ వెంకటాపూర్, రాయవరం గ్రామాల్లో కొనసాగుతున్న చెరువుల పూడికతీత పనులను పరిశీలించారు. కూలీలతో ముఖాముఖీ నిర్వహించారు. సరైన వసతులు లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, పలు గ్రామాల్లో ఇందిరమ్మ పథకంలో నిర్మించిన ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నూతనంగా తీసుకువచ్చిన వీబీజీ రామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ తూం శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు రవీందర్, సంతోష్‌రెడ్డి, మహేందర్, నర్సింహ్మచారి, రుషీ, సుధాకర్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, ప్రవీణ్ పాల్గొన్నారు.
మార్కెట్ పనుల అడ్డగింత
రేపటి ప్రజావాణి రద్దు
మెదక్ కలెక్టరేట్: ఈనెల 13న మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపాలిటీలు, తహసీల్దార్ కార్యాలయాల్లోనూ తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు చెప్పా రు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో అధికారుల నిమగ్నమయ్యారని, అందుకే ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు తెలిపారు. జిల్లా ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.


