పుల్‌కల్(అందోల్): సింగూరు ప్రాజెక్టు నుంచి ఒక గేట్‌ను ఎత్తి దిగువన ఘనపూర్ ఆయకట్టుకు సాగు నీరు విడుదల చేశారు. ప్రాజెక్టుకు మరమ్మతుల దృష్ట్యా ఘనపూర్ ఆయకట్టుకు పంట విరామం ప్రకటించినా, కొందరు రైతులు యాసంగి సాగు వేశారు. దీంతో ఘనపూర్ ఆనకట్టకు నీటి కొరత ఏర్పడింది. పంట చివరి దశలో ఉండటంతో నీటి కొరత ఏర్పడింది. అధికారుల సూచన మేరకు శనివారం సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. 5వ నంబర్ గేట్‌ను మీటరున్నర ఎత్తి మంజీరాలోకి నీటిని వదిలారు. అక్కడి నుంచి ఘనపూర్‌కు నీరు చేరుకుంటుందని అధికారులు తెలిపారు.


