సిద్ధాంతి చొరవ..
● రోడ్డుపై గుంతల పూడ్చివేత ● హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు
తూప్రాన్: రహదారిపై ఏర్పడిన గుంతలను పట్టణానికి చెందిన సిద్ధాంతి సోమయాజుల రవీందర్‌శర్మ చొరవ తీసుకుని పూడ్చివేయించారు. వివరాలు ఇలా... పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా నుంచి వెంకటాపూర్ వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర తూప్రాన్‌న్– నర్సాపూర్ రోడ్డుపై ప్రమాదకరంగా గుంతలు ఏర్పడ్డాయి. ఆర్‌అండ్‌బీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో రవీందర్ శర్మ సొంత ఖర్చులతో బీటీ రోడ్డుపై ఏర్పడిన గుంతలను కంకర, సిమెంట్‌తో పూడ్చి వేయించారు. దీంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


