రాజకీయ వేధింపులు అరికట్టండి
వెల్దుర్తి(తూప్రాన్) : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటమి చెందిన అభ్యర్థి తమను వేధింపులకు గురి చేస్తున్నాడని మండలంలోని ఆరెగూడెం సర్పంచ్‌గా ఎన్నికై న చైతన్య ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పంచాయతీ ఎన్నికల్లో ఓటమి చెందిన వారు గ్రామంలో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని వాపోయారు. తమ గెలుపును జీర్ణించుకోలేక మద్దతు ఇచ్చినవారిపై సైతం దాడులకు పాల్పడ్డారని తెలిపారు. గ్రామంలో మంచినీటి సరఫరా చేయకుండా అడ్డుకుంటున్నారని, అంగన్‌వాడీ కేంద్రం నిర్వాహకులను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో అధికారులు స్పందించి రాజకీయ వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు.


