బైకు అదుపుతప్పి వ్యక్తి మృతి
నర్సాపూర్ రూరల్: బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నర్సాపూర్ – వెల్దుర్తి రహదారిలోని నారాయణపూర్ టర్నింగ్ వద్ద గురువారం రాత్రి జరిగింది. నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నర్సాపూర్ పట్టణంలో నివాసం ఉండే ఎల్లపురం వెంకటేశ్ (54) గురువారం రాత్రి బైక్‌పై నర్సాపూర్ మండలం లింగాపూర్ నుంచి నర్సాపూర్ వైపు వస్తుండగా నారాయణపూర్ టర్నింగ్ వద్ద అదుపుతప్పి కిందపడ్డాడు. అటుగా వెళుతున్న కొంతమంది అదే రాత్రి నర్సాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించగా స్థానిక వైద్యులు చికిత్స అందించారు. మెరుగైన వైద్య కోసం హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుని స్వగ్రామం గౌడిచర్ల కాగా 30 ఏళ్లుగా నర్సాపూర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతునికి భార్య పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
చికిత్స పొందుతూ ఒకరి మృతి
నంగునూరు(సిద్దిపేట): రోడ్డు ప్రమాదంలో దంపతులు గాయపడ్డ ఘటనలో చికిత్స పొందుతూ శుక్రవారం భర్త మృతి చెందాడు. నంగునూరు మండలం దర్గపల్లికి చెందిన తాటిపట్టి బాల్‌రెడ్డి (45) భార్య రజితతో కలసి గురువారం బైక్‌పై చేర్యాలకు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈక్రమంలో గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న మోటారు సైకిల్ వీరిని ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురికి హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా బాల్‌రెడ్డి మృతి చెందారు. ఇద్దరు చికిత్స పొందుతున్నారు.
పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో..
పటాన్‌చెరుటౌన్: చికిత్స పొందుతూ వృద్ధుడు మృతిచెందిన సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పటాన్‌చెరు డివిజన్ పరిధి నవపాన్ చౌరస్తా సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి ఈనెల 11న మద్యం మత్తులో కిందపడి గాయపడ్డాడు. దీంతో అతడిని ముందుగా పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి సంబంధించిన బంధువులు ఉంటే పటాన్‌చెరు పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
హవేళిఘణాపూర్(మెదక్): విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన మెదక్ మండలం గుట్టకిందిపల్లి గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అయితరబోయిన చంద్రం(31) తనకున్న అరెకరంలో తుకం పోశాడు. తుకం నాటు దశకు రావడంతో దుక్కికి నీళ్లు పారబెట్టేందుకు వెళ్లగా స్టార్టర్ డబ్బాలో కరెంటు సరఫరా కాలేదు. దీంతో ట్రాన్స్‌ఫార్మర్ బంద్ చేసి రిపేర్ చేద్దామని వెళ్లిన రైతు కరెంటు షాక్ కొట్టడంతో కిందపడిపోయాడు. ఇది గమనించిన తోటి రైతులు ఆయను మెదక్ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మెదక్‌రూరల్ ఎస్‌ఐ లింగం ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతునికి భార్య బాలమణి, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
బైకు అదుపుతప్పి వ్యక్తి మృతి
బైకు అదుపుతప్పి వ్యక్తి మృతి


