అభివృద్ధి పనులపై అధ్యయనం
కోనాయపల్లి(పిటి)లో పర్యటించినఎన్‌ఐఆర్డీ బృందం
పలు పనులు బాగున్నాయని ప్రశంస
మనోహరాబాద్(తూప్రాన్): ఉపాధిహామి పనుల్లో భాగంగా మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎన్‌ఐఆర్డీ బృందం పర్యటించి తెలుసుకుంది. శుక్రవారం అసోసియేట్ ప్రొఫెసర్ ఆకాంక్ష శుక్ల, షేక్ ఆరీఫ్‌తో పాటు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన 26 మంది బృందం పర్యటించింది. ఈ సందర్భంగా మండలంలోని కోనాయపల్లి(పీటి)లో ఉపాధిహామి పనుల్లో భాగంగా ఏయే పనులు చేశారో వాటిని పరిశీలించి వివరాలు సేకరించారు. ఉపాధిహామి కూలీలకు ఇచ్చే జాబ్‌కార్డుల్లో క్యూర్ ఆర్ కోడ్ సిస్టమ్ చాలా బాగుందని ప్రశంసించారు. సెగ్రిగేషన్ షెడ్డు, పల్లె ప్రకృతి వనం, నర్సరీలు, క్యాటిల్ షెడ్, కూరగాయల తోటలు, నీటి తొట్టెలు, ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. వీరి వెంట గ్రామ సర్పంచ్ మన్నె కళ్యాణ్, ఉప సర్పంచ్ శ్రవణ్‌కుమార్, హెచ్‌ఆర్ మేనేజర్ రాజేందర్‌రెడ్డి, ఏపీఓ ఆదినారాయణ, ఈసీ లక్ష్మీనారాయణ, టీఏ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి వేణుగోపాల్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.


