గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
పటాన్‌చెరు టౌన్: గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన సంఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మహేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్‌చెరు మార్కెట్ రోడ్డులో ఓ షాపు ఎదుట గుర్తుతెలియని మహిళ (50) మృతదేహాన్ని వదిలి వెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించగా మహిళ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు గుర్తించారు. మృతురాలికి సంబంధించిన బంధువులు ఉంటే పటాన్‌చెరు పోలీసులను సంప్రదించాలన్నారు.
అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో..
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన అమీన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నవ్య జంక్షన్ వెళ్లే దారిలో నరేంద్రనగర్ సమీపంలో చెట్ల పొదల్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం శుక్రవారం రాత్రి కనిపించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతిచెందిన వ్యక్తి వయసు 50 సంవత్సరాల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


