‘ఖేడ్’ లో మిశ్రమ ఫలితాలు
నారాయణఖేడ్: పంచాయతీ ఎన్నికల్లో స్థానిక నియోజకవ్గంలో మెజార్టీ సర్పంచ్‌లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నా.. మండల కేంద్రాల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ముఖ్యంగా నూతనంగా ఏర్పాటైన నిజాంపేట్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఖాతా తెరవలేకపోయింది. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సర్పంచ్‌గా ఎన్నికకాలేదు. గతంలో టీడీపీ, బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన వ్యక్తులే విజయం సాధించారు. దాదాపు 40 ఏళ్ల కాలం నుంచి కాంగ్రెస్ ఖాతా తెరవాలని ప్రయత్నించినా సఫలం కాలేదు. ఈ సారి ఎలాగైనా పాగా వేయాలని యత్నించినా చివరకు బీఆర్‌ఎస్ అభ్యర్థి కావ్యరెడ్డి విజయం సాధించింది. అదే విధంగా కంగ్టి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ మద్దతుతో కృష్ణ, మనూరులో కాంగ్రెస్ మద్దతుదారులు జి.రమ్య సిద్దారెడ్డి, నాగల్‌గిద్దలో కాంగ్రెస్ మద్దతుదారు ఎస్.లక్ష్మి, సిర్గాపూర్‌లో కాంగ్రెస్ మద్దతుదారు శ్రీనివాస్, కల్హేర్‌లో కాంగ్రెస్ మద్దతుదారు గంగారాం విజయం సాధించారు. ఇక, నాగల్‌గిద్ద మండలంలో 9మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. బీఆర్‌ఎస్ నుంచి ఒకరు, బీజేపీ నుంచి ఒకరు, కాంగ్రెస్‌లో రెబల్ బెడద కారణంగా ఆరుగురు పోటీ పడగా.. చివరికి కాంగ్రెస్ మద్దతుతో లక్ష్మికి విజయం వరించింది.


