బస్సును ఢీకొన్న లారీ | - | Sakshi
Sakshi News home page

బస్సును ఢీకొన్న లారీ

Dec 19 2025 10:15 AM | Updated on Dec 19 2025 10:15 AM

బస్సును ఢీకొన్న లారీ

బస్సును ఢీకొన్న లారీ

సిద్దిపేటకమాన్‌: ఆర్టీసీ అద్దె బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. లారీ డ్రైవర్‌ బస్సును తప్పించడానికి ప్రయత్నించి డివైడర్‌ను ఢీ కొట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన సిద్దిపేట శివారులో గురువారం చోటు చేసుకుంది. ఆర్టీసీ అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. వేములవాడ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు వేములవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తోంది. ఈ క్రమంలో పట్టణ శివారులో బైపాస్‌ రోడ్డు నుంచి సిద్దిపేట వైపు వస్తున్న ఓ సిమెంట్‌ లారీ కుడి వైపునకు టర్న్‌ తీసుకోవడంతో ఆ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. అదే సమయంలో లారీని పక్కకు తీస్తున్న క్రమంలో డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో లారీ డ్రైవర్‌తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న 8 మందికి గాయాలయ్యాయి. వారిలో ఆరుగురికి స్వల్ప గాయాలు కాగా కరీంనగర్‌కు చెందిన తల్లి కూతుళ్లు రేఖ, వజ్రవ్వకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది గాయపడిన వారిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు.

8 మందికి గాయాలు

తప్పిన పెను ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement