సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
మెదక్ మున్సిపాలిటీ: ఆకర్షణీయమైన ప్రకటనలు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని నమ్మ బలుకుతూ సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. గురువారం సైబర్ నేరాలపై రూపొందించిన అవగాహన పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. పోస్టర్ల ద్వారా జిల్లావ్యాప్తంగా విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు తదితర రద్దీ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ప్రధానంగా ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు మరింత జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, సైబర్ క్రైం డీఎస్పీ సుభాశ్ చంద్రబోస్, ఆర్‌ఐ శైలందర్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు


