న్యాయ సహాయ కేంద్రం ప్రారంభం
మెదక్ కలెక్టరేట్: మెదక్ ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన న్యాయ సహాయ కేంద్రాన్ని సీనియ ర్ సివిల్ జడ్జి రుబీనా ఫాతిమ గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ సూచనలతో కేంద్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ఈ న్యాయ సహాయ కేంద్రం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుందని తెలిపారు. ఒక ప్యానెల్ లాయర్, ఒక పార లీగల్ వలంటీర్‌ను నియమిస్తామన్నారు. వారి ద్వారా సీనియర్ సిటిజన్స్‌కు అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ డీఏఓ బలరాం, ప్యానెల్ లాయర్ దుర్గారెడ్డి, పార లీగల్ వలంటీర్ చంద్రకళ, రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ స్టాఫ్ మెంబెర్స్ తదితరులు పాల్గొన్నారు.


