హెచ్‌ఆర్‌ఏ మంజూరు చేయాలి
జిన్నారం (పటాన్‌చెరు): గడ్డపోతారం గుమ్మడిదల ప్రభుత్వ పాఠశాలలు జీహెచ్‌ఎంసీకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని, వాటి పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ మంజూరు చే యాలని పీఆ ర్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మానయ్యను కలిసి మండల పీఆర్టీయూ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. హెచ్‌ఆర్‌ఏ మంజూరుకు కృషి చేయాలని విన్నవించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడిని ఉపాధ్యాయ సంఘం నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష , కార్యదర్శులు అనిల్ కుమార్, పవన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.
రామాయంపేట(మెదక్): చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. వివరాలు ఇలా... గుల్పర్తి గ్రామానికి చెందిన తొంటవలి సిద్ధరాములు (58) చేపలు పట్టడానికి బుధవారం మరికొందరితో కలిసి కోమటిపల్లి ఊర చెరువు వద్దకు వెళ్లాడు. చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు అతడు నీటిలో మునిగి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని కూతురు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ బాల్‌రాజ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కల్హేర్(నారాయణకేడ్): మండలంలోని అలీఖాన్‌పల్లిలో దాడి చేసి కారు అద్దాలు పగులగొట్టిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు కల్హేర్ ఎస్‌ఐ రవిగౌడ్ తెలిపారు. మార్డికి చెందిన ఎన్‌ఆర్‌ఐ గుర్రపు మశ్చేందర్ ఫార్చునర్ వాహనంలో బంధువుల ఇంటికి వెళ్లగా గ్రామానికి చెందిన విస్లావత్ రవి, తదితరులు దాడి చేశారని పేర్కొన్నారు.
హెచ్‌ఆర్‌ఏ మంజూరు చేయాలి


