స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం
మిరుదొడ్డి(దుబ్బాక): స్క్రాప్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన పర్శరాములుకు చెందిన పాత ఇనుప సామాన్ల దుకాణంలో ప్రమాదవశాత్తు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో పాత ప్లాస్టిక్ వస్తువులతో పాటు, రాగి తదితర సామాన్లు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న భూంపల్లి ఎస్‌ఐ హరీశ్‌తో పాటు, దుబ్బాక అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
సంగారెడ్డి టౌన్: అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం సంగారెడ్డి పట్టణ శివారులోని శిశు మందిర్ పాఠశాలలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా నివారించాలో ప్రయోగాత్మకంగా చూపించారు. అగ్నిమాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
అవగాహన కల్పిస్తున్న సిబ్బంది
స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం


