30 మంది క్రీడాకారుల ఎంపిక
సంగారెడ్డి క్రైమ్: జిల్లా హెడ్ క్వార్డర్స్‌లోని ఎమ్‌ఎస్ క్రికెట్ అకాడమీలో బుధవారం ఏర్పాటు చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి క్రికెట్ ఎంపికలు అట్టహాసంగా జరిగాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖ ఇండస్ట్రీస్ వారి సౌజన్యంతో నిర్వహించిన ఈ పోటీలకు ఉమ్మడి మెదక్ , సంగారెడ్డి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున్న క్రికెట్ క్రీడాకారులు హాజరయ్యారు. జిల్లా క్రికెట్ లీగ్, నాక్‌ఔట్ విభాగంలో ఎంపికలు చేయగా సంబంధిత క్రీడాకారులు తమ ప్రతిభతో రాణించారు. బాలింగ్, బ్యాటింగ్ విభాగంలో ఉత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఉత్తమ ఆటతీరు కనబర్చిన 30 మంది కీడ్రాకారులను ఎంపిక చేసినట్లు కార్యదర్శి రాజేందర్ రెడ్డి తెలిపారు. అసోసియేషన్ కోచ్‌లు శ్రీనాథ్ రెడ్డి, కలీం, తౌహీద్ ,చంద్రమౌళి, అనిల్ కుమార్, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.


