పోలింగ్ సరళి ఎలా ఉంది..
పరిశీలించిన కలెక్టర్ ప్రావీణ్య
నారాయణఖేడ్: డివిజన్ పరిధిలో ఎన్నికల తీరును కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. నిజాంపేట, ర్యాలమడుగులో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన క్యూలైన్‌ల వివరాలు, దివ్యాంగుల కోసం కల్పించిన సౌకర్యాలు, ఇతర సదుపాయాల గురించి తెలుసుకొని పలు సూచనలు చేశారు. అనంతరం నారాయణఖేడ్‌లోని సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ఎస్పీ పరితోష్ పంకజ్, సబ్ కలెక్టర్ ఉమా హారతితో కలిసి సందర్శించారు. కాగా ఉమా హారతి నారాయణఖేడ్ మండలం చాప్టా(కె) తదితర గ్రామాలను సందర్శించి పోలింగ్ తీరును పరిశీలించారు.


