
హోమం నిర్వహిస్తున్న నీలం మధు
జహీరాబాద్ టౌన్: ప్రతి ముస్లిం తన జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. పట్టణంలో గడి వీధి హరి మసీద్ కమిటీ సభ్యులు హజ్ యాత్రకు వెళ్తున్న సందర్భంగా బుధవారం వారిని సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లింల పుణ్యక్షేత్రమైన మక్కా దర్శనం చేయడం గొప్ప విషయమన్నారు. అనంతరం జహీరాబాద్ లోక్‌సభ బీఆర్‌ఎస్ అభ్యర్థి గాలి అనికుమార్ యాత్రీకులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు తంజీమ్, మచ్చేందర్, సంజీవ్‌రెడ్డి, అక్బర్, ముర్తుజా, మిథున్‌రాజ్, పర్వేజ్, అలీ, హాశం, జప్పార్ పాల్గొన్నారు.
జనహితం కోసం హోమం
పటాన్‌చెరు టౌన్: మెదక్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ఆధ్వర్యంలో చిట్కూల్‌లో శ్రీరామనవమి సందర్భంగా వసంత నవరాత్రుల పూర్ణాహుతి హోమాన్ని జరిపించారు. నీలం సతీసమేతంగా పాల్గొని పూజలు చేశారు. సకల జనులు సుభిక్షంగా ఉండాలని యజ్ఞం జరిపించినట్లు ఆయన పేర్కొన్నారు. పదకొండు రోజులుగా జరుగుతున్న ఈ మహా యజ్ఞం బుధవారం లక్ష పుష్పార్చనతో ముగిసింది.
సరిహద్దుల్లో పటిష్ట నిఘా
కంగ్టి(నారాయణఖేడ్): లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాల సరిహద్దుల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ రఫీయొద్దీన్ తెలిపారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిఽహద్దుల్లో ఉన్న మండల పరిధిలోని దెగుల్‌వాడి చెక్‌పోస్టు వద్ద పకడ్బందీగా వాహనాల తనిఖీ చేపడుతున్నారు. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లాలంటే సరైన ఆధారాలు ఉండాలని తెలిపారు. ఎకై ్సజ్ పోలీసు కానిస్టేబుల్ సాయులు, ఏఈఓ సంతోష్ ఉన్నారు.
మూడు సార్లు పర్వతారోహణ
గజ్వేల్‌రూరల్: గజ్వేల్‌లోని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్‌సీసీ క్యాడెట్ కార్పోరల్ రాజేష్ వరుసగా 3 సార్లు పర్వతారోహణ చేసినట్లు ఆ కళాశాల ఎన్‌సీసీ లెఫ్టినెంట్ ఆఫీసర్ డాక్టర్ భవాని బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కళాశాలకు చెందిన రాజేష్ 2022 అక్టోబర్ 1 నుంచి 26 వరకు సుమారు 26 రోజుల పాటు హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో బేసిక్ మౌంటైనీరింగ్ శిబిరాన్ని 2023లో ఏప్రిల్ 1 నుంచి 28వ వరకు సుమారు 28రోజుల పాటు పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్‌లో అడ్వాన్స్ మౌంటేనేరింగ్ క్యాంప్‌ను, 2024లో మార్చి 22 నుంచి ఏప్రిల్ 11వరకు సుమారు 20 రోజుల ఉత్తరాఖాండ్‌లోని ఉత్తర కాశీలో సెర్చ్ అండ్ రెస్క్యూ క్యాంప్‌ను పూర్తి చేశారన్నారు.

హజ్ యాత్రికులను సన్మానిస్తున్న ఎమ్మెల్యే

వాహనాలను తనిఖీ చేస్తున్న అధికారులు