ఆర్సీబీ ఓటమిపై స్పందించిన కోహ్లి | Virat Kohli Breaks Silence On RCB's 2nd Loss In Three IPL 2024 Games | Sakshi
Sakshi News home page

ఆర్సీబీ ఓటమిపై స్పందించిన కోహ్లి.. ఇలా అయితే..

Mar 30 2024 4:49 PM | Updated on Apr 1 2024 5:17 PM

Virat Kohli Breaks Silence On RCB's 2nd Loss In Three IPL 2024 Games

ఆర్సీబీ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి

ఐపీఎల్‌-2024లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు మరో ఓటమి ఎదురైంది. ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో ఓడిన ఆర్సీబీ.. తిరిగి పుంజుకుని పంజాబ్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. కానీ మళ్లీ పాత కథను పునరావృతం చేస్తూ సొంత మైదానంలో శుక్రవారం నాటి మ్యాచ్‌లో పరాజయం పాలైంది.

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ విషయంపై స్పందించిన ఆర్సీబీ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి.. జట్టులో ఉత్సాహం నింపే ప్రయత్నం చేశాడు. స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాం కాబట్టే ఓడిపోయామని.. కచ్చితంగా తిరిగి పుంజుకుంటామనే ఆశాభావం వ్యక్తం చేశాడు.

కాగా కేకేఆర్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఒక్కడే రాణించిన విషయం తెలిసిందే. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఈ రన్‌మెషీన్‌.. 59 బంతుల్లో 83 పరుగులు సాధించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. మిగతా వాళ్లలో కనీసం ఒక్కరు కూడా 35 పరుగుల మార్కును కూడా అందుకోలేకపోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఆర్సీబీ 182 పరుగులు చేసింది.

ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన కేకేఆర్‌ 16.5 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఫిలిప్‌ సాల్ట్‌(30), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ సునిల్‌ నరైన్‌(47), వెంకటేశ్‌ అయ్యర్‌(50) అద్భుత ఇన్నింగ్స్‌ కారణంగా ఆర్సీబీ విధించిన టార్గెట్‌ను ఉఫ్‌మని ఊదేసింది. ఫలితంగా బెంగళూరుకు రెండో పరాజయం ఎదురైంది.  

ఈ నేపథ్యంలో డ్రెసింగ్‌ రూంలో ఆర్సీబీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న కోహ్లి సహచర ఆటగాళ్లను ఉద్దేశించి ప్రసంగించాడు. ‘‘ఈరోజు ఎంత కఠినంగా గడిచిందో మనందరికీ తెలుసు. నిజానికి మనం ఇంతకంటే గొప్పగా ఆడేవాళ్లం.

కానీ.. అలా జరిగిపోయింది. జట్టుగా మనం పటిష్టంగా ఉన్నామనే ధైర్యంతో ముందుకు సాగాలి. మన నైపుణ్యాల పట్ల నమ్మకం ఉంచాలి. అలా అయితేనే మనం తిరిగి పుంజుకోగలం. సరైన మార్గంలో లక్ష్యం దిశగా పయనించగలం’’ అని కోహ్లి స్ఫూర్తిదాయక వ్యాఖ్యలు చేశాడు.

కాగా ఐపీఎల్‌ తాజా సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో ఆర్సీబీ బ్యాటర్‌ కోహ్లి 181 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతూ ఆరెంజ్‌ క్యాప్‌ను మరోసారి(ప్రస్తుతానికి) కైవసం చేసుకున్నాడు. అతడి తర్వాతి స్థానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌(2 మ్యాచ్‌లలో 143 రన్స్‌) ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement