Telangana Crime News: నిద్ర లేవలేదని.. పిల్లలపై వేడినీళ్లు పోసిన తల్లి!
Sakshi News home page

నిద్ర లేవలేదని.. పిల్లలపై వేడినీళ్లు పోసిన తల్లి!

Aug 22 2023 6:08 AM | Updated on Aug 22 2023 9:36 AM

- - Sakshi

సంగారెడ్డి: నిద్రలేవలేదనే కారణంతో ఇద్దరు చిన్నారులపై ఓ తల్లి వేడినీటిని గుమ్మరించింది. దీంతో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ మధుసూదన్‌గౌడ్‌ కథనం ప్రకారం.. ఎల్కపల్లికి చెందిన ఎంచర్ల సంతోష, సాయిలు దంపతులకు ఇద్దరు సంతానం. భార్యాభర్తల మధ్య కొన్ని నెలలుగా వివాదాలు జరుగుతున్నాయి.

సోమవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో నిద్ర లేవలేదనే కారణంతో చిన్నారులు శ్రీనిధి, రిత్విక్‌లపై మరిగేనీటిని పోసింది. ఈ ఘటనలో పొట్ట, ఛాతి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే మెదక్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. రిత్విక్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement