జిన్నారం (పటాన్‌చెరు): ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పట్టణ కేంద్రంలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు జగన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి హాజరై, నాయకులతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రతి బీజేపీ కార్యకర్త తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంకటేష్, కో–ఆప్షన్ సభ్యులు నర్సింగ్ రావు, శ్రీనివాస్ యాదవ్, దుబ్బా శ్రీనివాస్, చిత్తారి యాదవ్, భిక్షపతి, రాజు, లక్ష్మణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


