కాంగ్రెస్‌ పార్టీలో చేరిక | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పార్టీలో చేరిక

Aug 11 2026 7:15 AM | Updated on Aug 11 2026 7:15 AM

శాకాంబరీ దేవిగా కన్యకా పరమేశ్వరీ 42,921 ఓట్లు ఔట్‌!

రామచంద్రాపురం(పటాన్‌చెరు): తెల్లాపూర్‌ డివిజన్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు వడ్డే శ్రీనివాస్‌ సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి సమీక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ కొల్లూరి భరత్‌, నాయకులు ప్రభాకర్‌ రెడ్డి, బాబు గౌడ్‌, వాజీద్‌లు పాల్గొన్నారు.

నర్సాపూర్‌: పట్టణంలోని కన్యకా పరమేశ్వరీ మాత ఆలయంలో ఆషాఢం మాసం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం మాతకు ప్రత్యేక అలంకరణ చేశారు. శాకాంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పూజల్లో భక్తులు, పలువురు ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.

లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో న్యాయమూర్తి

శివ్వంపేట(నర్సాపూర్‌): ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధి చెందిన సికింద్లాపూర్‌ లక్ష్మీనర్సింహస్వామిని నర్సాపూర్‌ కోర్టు న్యాయమూర్తి హేమలత కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చక సిబ్బంది న్యాయమూర్తికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, వేద ఆశీర్వాదం అందజేశారు. ఈ మేరకు ఆలయ విశిష్టత గురించి న్యాయమూర్తికి వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీనివాస్‌, పధాన అర్చకులు ధనుంజయ్‌శర్మ, విద్యాకర్‌చారి, జూనియర్‌ సహాయకులు నర్సింహారెడ్డి ఉన్నారు.

జిల్లాలో ముగిసిన ‘సర్‌’ ప్రక్రియ

మెదక్‌లో 18,691, నర్సాపూర్‌లో 24,230 ఓట్లు

ఓవరాల్‌గా తగ్గిన 9 శాతం

మెదక్‌జోన్‌: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) సోమవారం సాయంత్రానికి ఈ ప్రక్రియ ముగిసింది. ఓవరాల్‌గా జిల్లాలో 42,921 ఓట్లను తొలగించారు. అందులో నర్సాపూర్‌లో నియోజకవర్గంలో 24,230 ఓట్లను తొలగించగా, మెదక్‌లో 18,691 ఓట్లు తగ్గాయి. ఈ లెక్కన ఓవరాల్‌గా 9శాతం ఓట్లు తొలగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో మెదక్‌, నర్సాపూర్‌ రెండు నియోజకవర్గాలన్నాయి. వీటి పరిధిలో 4,53,140 మంది ఓటర్లు ఉండగా, సర్‌ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటర్‌కు ఎన్యూమరేషన్‌ ఫారాన్ని బీఎల్‌ఓలు అందించారు. కాగా తిరిగి ఇచ్చినవి మాత్రం 4,10,219 మంది ఓటర్లు మాత్రమే. ఈ లెక్కన 42,921 మంది ఓటర్లు ఇవ్వలేదు. ఇందులో భాగంగా నర్సాపూర్‌ నియోజకవర్గంలో 2,32,713 మంది ఓటర్లు ఉండగా 2,08,483 మంది మాత్రమే ఫారంలు తిరిగి ఇవ్వగా 24,230 ఓట్లు తొలగిపోయాయి. అంటే 89.51 శాతం మాత్రమే డిజిటలైజేషన్‌ అయింది. 10.49 శాతం మంది ఓటర్లు తగ్గారు. అలాగే మెదక్‌ నియోజకవర్గంలో 2,20,427 మంది ఓటర్లకు గానూ ఎన్యూమరేషన్‌ ఫారంలు తిరిగి ఇచ్చినవి 2,01,736 మంది మాత్రమే. అంటే18,691 మంది ఓట్లు తొలగిపోయాయి. దీంతో 91 శాతం డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తికాగా 9 శాతం ఓట్లు తొలగిపోయాయి. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో కలిపి 9 శాతం ఓట్లు తొలగిపోయినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేశాయి.

రవీంద్రశర్మకు అవార్డు ప్రదానం

తూప్రాన్‌: పట్టణానికి చెందిన సొమయాజుల రవీంద్రశర్మకు మెదక్‌ జిల్లా బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జిల్లా సంఘం అధ్యక్షుడు శలాఖ రాజేశ్వరశర్మ ‘సహస్ర యాగ బ్రహ్మ’ బిరు దును ప్రదానం చేశారు. కార్యక్రమం రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమాఖ్య అధ్యక్షుడు మోత్కురి రామేశ్వరరావు సమక్షంలో నిర్వహించారు. దీంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement