ఘనంగా బండ్ల బోనాలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా బండ్ల బోనాలు

Aug 11 2026 7:15 AM | Updated on Aug 11 2026 7:15 AM

నర్సాపూర్‌: నర్సాపూర్‌లో ఘనంగా ఘనంగా బండ్లు బోనాలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. పట్టణంలోని గ్రామ దేవతలు భూలక్ష్మమ్మ, దుర్గమ్మ, నల్లపోచమ్మకు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు. బండ్లు, బోనాలతో తరలివచ్చి మొక్కులు చెల్లించారు. పలు సంఘాల ఆధ్వర్యంలో ఫలహారం బండ్లు ఏర్పాటుచేసి పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్‌, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవులరాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ సుహాసినీరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లక్ష్మి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీయాదవ్‌, రఘువీరారెడ్డిలతో పాటు ఆయా పార్టీల నాయకులు కౌన్సిలర్లు వేర్వేరుగా పాల్గొని పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement