చేపలు తెచ్చిన తంటా.. | - | Sakshi
Sakshi News home page

చేపలు తెచ్చిన తంటా..

Jul 27 2023 8:16 AM | Updated on Jul 27 2023 2:20 PM

- - Sakshi

సంగారెడ్డి: ఒక వ్యక్తిపై ఇద్దరు కత్తి, కర్తతో మంగళవారం రాత్రి దాడి చేశారు. ఈ దాడిలో అతడి తలకు గాయమైంది. ఈ ఉదంతం తోటపల్లిలో మంగళవారం జరిగింది. చేపలు పట్టే వాగు వద్ద వీరన్నకు, సంపత్‌కు గొడవైంది. ఈ గొడవలో సంపత్‌కు గాయాలయ్యాయి. అనంతరం ఆయన చికిత్సపొందుతూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తర్వాత సంపత్‌ బంధువులు భాస్కర్‌, మరొక వ్యక్తితో కలిసి వీరన్నపై దాడికి వెళ్లారు.

వీరన్న, భాస్కర్‌ మధ్య గొడవ జరుగుతోంది. ఈ గొడవ విషయం వీరన్న కుటుంబసభ్యులతో అతడి వెంట ఉన్న వ్యక్తి చెప్పారు. వీరన్న తండ్రి మల్లేశం, సోదరుడు రమేశ్‌ కత్తి, కర్త తీసుకొని గొడవ పడుతున్న స్థలానికి చేరుకొని భాస్కర్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో భాస్కర్‌కు తల పగిలింది. దీనిపై స్థానికులు పోలీసులకు, భాస్కర్‌ కుటుంబీకులు సమాచారం అందించారు. భాస్కర్‌ కుటుంబీకులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ పీ మహేశ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement