శంకర్‌పల్లి: అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్న 8 బెల్టు దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహించి, కేసు నమోదు చేశారు. సీఐ రుధ్వీర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పర్వేద గ్రామంలో 8 మంది కిరాణా, ఫాస్ట్‌ఫుడ్, జనరల్ స్టోర్లలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం అందింది. వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఏకకాలంలో దాడులు చేశారు. వారి నుంచి 42లీటర్ల మద్యం స్వాఽధీనం చేసుకున్నారు. 8మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
42 లీటర్ల మద్యం స్వాధీనం, కేసు నమోదు


