వ్యవసాయం | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయం

Nov 16 2026 8:41 AM | Updated on Nov 16 2026 8:41 AM

సోమవారం శ్రీ 16 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 16 శ్రీ నవంబర్‌ శ్రీ 2026
విద్యుత్‌ శాఖ

షాద్‌నగర్‌: వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరతతో పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయంలో సరికొత్త ప్రయోగానికి విద్యుత్‌ శాఖ శ్రీకారం చుట్టింది. తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడులు సాధించే దిశగా చర్యలు చేపట్టింది. నీటి పొదుపును ప్రోత్సహిస్తూ రైతులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ఖేతిరక్షక్‌ నెట్‌ నిర్వహణకు ప్రణాళికలు రూపొందించింది. షాద్‌నగర్‌ పరిధిలోని చించోడ్‌ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో రాష్ట్రంలోనే తొలి పైలెట్‌ ప్రాజెక్టు కింద పంటల సాగు కోసం పోర్టబుల్‌ నెట్‌హౌస్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

రాష్ట్రంలోనే తొలిసారిగా..

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తెలంగాణ ఉద్యానశాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం వారి సహకారంతో ఖేతి రక్షక్‌ నెట్‌హౌస్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పాలీహౌస్‌ తరహాలో సింథటిక్‌ పోర్టబుల్‌ హౌస్‌ను ఏర్పాటు చేసి పంటల సాగుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా పైలెట్‌ ప్రాజెక్టు కింద ఫరూఖ్‌నగర్‌ మండలం చించోడ్‌ సబ్‌ స్టేషన్‌లో విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో ఈ నెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల విద్యుత్‌ శాఖ సీఎండీ జితేష్‌ వి.పాటిల్‌ ఈ నెట్‌హౌస్‌ను పరిశీలించారు. ఇది విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నారు. నెట్‌ హౌస్‌ కింద పంటల సాగును విద్యుత్‌ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ఏడాది పొడవునా సాగు

పాలీహౌస్‌ తరహాలో సింథటిక్‌ నెట్‌ వేసి రైతులు తమకు నచ్చిన పంటలు సాగు చేసుకోవచ్చు. ఆరుతడి పంటలు, కూరగాయలు, ఆకుకూరలు, పూల వంటి 20కిపైగా రకాల పంటలను సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా పండించొచ్చు. తక్కువ నీటితో పంటలు సాగు చేయడం, పంట నాణ్యతను పెంచడంతో రైతులకు అదనపు ఆదాయం వస్తుంది. మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు సాగు చేస్తే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

ఆధునిక సాంకేతికతతో సాగులో కొత్త ఒరవడి

నెట్‌హౌస్‌తో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం

ఫరూఖ్‌నగర్‌ మండలం చించోడ్‌లో పైలెట్‌ ప్రాజెక్టు

నీటి పొదుపును ప్రోత్సహించడమే లక్ష్యం

తక్కువ నీటితో పంటల సాగు.. అధిక దిగుబడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement