ధారూరు జాతరకు ప్రత్యేక బస్సులు | - | Sakshi
Sakshi News home page

ధారూరు జాతరకు ప్రత్యేక బస్సులు

Nov 16 2026 8:41 AM | Updated on Nov 16 2026 8:41 AM

ధారూరు జాతరకు ప్రత్యేక బస్సులు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా రాములు విద్యార్థినికి గోల్డ్‌ మెడల్‌

తాండూరు టౌన్‌: ధారూరు మెథడిస్ట్‌ జాతరను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం తాండూరు డిపో నుంచి ప్రత్యేక బస్సులను ఆదివారం ప్రారంభించినట్లు డీఎం ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. జాతరకు వెళ్లే భక్తులను దృష్టిలో పెట్టుకుని అదనపు బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు. భక్తులు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించరాదని, ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

బంట్వారం: బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా శాకం రాములు ముదిరాజ్‌ (బస్వాపూర్‌) నియమితులయ్యారు. ఆదివారం సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ చేతుల మీదుగా నగరంలో నియామకపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తానన్నారు. బీసీల హక్కుల సాధనకు అలుపెరగని పోరాటం చేస్తానన్నారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు శ్యామ్‌, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

పరిగి: ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎండీ రేడియాలజీ ఫైనల్‌ పరీక్షలో పరిగి విద్యార్థిని గోల్డ్‌ మోడల్‌ సాధించింది. పట్టణ పరిధిలోని సుల్తాన్‌పూర్‌కు చెందిన పిరంగి వెంకట్‌రెడ్డి, అరుణ దంపతుల కూతురు ప్రజ్ఞ ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ రేడియాలజీ చేస్తోంది. 2026 ఆగస్టులో జరిగిన ఫైనల్‌ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి స్టేట్‌ టాపర్‌గా నిలిచింది.

పెళ్లి పేరిట రూ.15 లక్షలు తీసుకొని మోసం

యువకుడిపై కేసు

మేడిపల్లి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ప్రేమ పేరుతో శారీరక సంబంధం పెట్టుకుని రూ.15 లక్షలు తీసుకొని మోసం చేశాడని ఓ యువతి మేడిపల్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులకు అందిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. చెంగిచెర్ల ద్వారకానగర్‌ కాలనీకి చెందిన ఓ యువతి (30)కి ఐదేళ్ల క్రితం పీర్జాదిగూడ గణేష్‌నగర్‌కు చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ పరిడుల ఉదయ్‌ (26)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఉదయ్‌ బాధితురాలి ఇంటికి తరచూ వెళ్లి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అతడి మాటలను నమ్మిన బాధిత యువతి ప్రేమ విషయం తల్లిదండ్రులకు తెలిపి, వారిని ఒప్పించింది. అయితే 2026 అక్టోబర్‌లో పెళ్లి చేసుకోవాలని అడగగా, తాను మరో యువతిని ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లికి నిరాకరించాడు. అంతేకాకుండా పెళ్లి చేసుకుంటానన్న నమ్మకంతో ఉదయ్‌కు రూ.15 లక్షలు ఇవ్వగా, కొంత మొత్తాన్ని మాత్రమే తిరిగి చెల్లించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement