రైతును రాజును చేసింది వైఎస్సార్‌ | - | Sakshi
Sakshi News home page

రైతును రాజును చేసింది వైఎస్సార్‌

Sep 12 2026 11:03 AM | Updated on Sep 12 2026 11:03 AM

ఉద్యానపంటల సాగుకు

ప్రోత్సాహం అవసరం

రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి

కేశంపేట: ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పాలసీ తెచ్చి ఆదుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ ముదిరెడ్డి కోదండరెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని సంగెం గ్రామంలో యెన్నం గోపాల్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధ్వర్యంలో మామిడి రైతులకు సమగ్ర సస్యరక్షణపై శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌ రైతును రాజుగా చేశారని అన్నారు. ఉచిత విద్యుత్‌, రుణమాఫీతో రైతులను ఆర్థికంగా ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు రుణమాఫీ చేసి ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన పంటలకు బోనస్‌ సైతం అందజేస్తుందన్నారు. ఉద్యాన పంటల అమ్మకాల కు సమీపంలోనే మార్కెటింగ్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కేరళం రాష్ట్రంలో మండలానికి ఒక మార్కెట్‌ ఉంటుందని, అక్కడ పంట విక్రయించిన వెంటనే రైతు అకౌంట్‌లో నేరుగా డబ్బు జమ చేస్తున్నారని.. మన రాష్ట్రంలోనూ అలాంటి వ్యవస్థ ఉండాలని ఆకాంక్షించారు. ఉద్యానపంట ల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఉద్యాన, పట్టుపరిశ్ర మ శాఖ అధికారి సురేశ్‌, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీకృష్ణ, ఉద్యానశాఖ అధికారి హిమబిందు, మండల విద్యుత్‌ అధికారి ఈశ్వర్‌, సర్పంచ్‌లు సురేశ్‌రెడ్డి, వేణుగోపాలచారి, బాబునాయక్‌, ఏఈఓలు నిఖిల్‌, రాజేశ్వరి, సుధ, రైతులు లింగారెడ్డి, నర్సింహ, రమేశ్‌రెడ్డి, జంగయ్య, వెంకన్న, పుండరీకం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement