యాచారం: గ్రామ పంచాయతీల ఆర్థిక లావాదేవీలు ఇక మీదట స్థానిక బ్యాంకుల్లోనే జరిపేలా దృష్టి సారించాలని.. తద్వారా సమయాన్ని ఆదా చేసుకోవచ్చని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్లు జాన్‌వెస్లీ, నాగేశ్వర్‌రావు అన్నారు. శుక్రవారం వారు పంచాయతీల ఆన్‌లైన్ ఆర్థిక లావాదేవీలపై అధ్యయనం కోసం యాచారం గ్రామ పంచాయతీని సందర్శించారు. ప్రస్తుతం పంచాయతీల్లో వసూళ్లు చేసే పన్నులను ఎస్‌టీఓల్లో జమ చేయడం, ఆ తర్వాత అత్యవసర పరిస్థితుల్లో డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో పంచాయతీల్లో సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు ఇబ్బందిగా మారుతుంది. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో వసూలు పన్నులను స్థానిక నేషనల్ బ్యాంకుల్లో జమ చేసి, చెక్కుల రూపంలో అవసరం ఉన్నప్పుడు డ్రా చేయడం వల్ల సులభంగా సేవలు పొందవచ్చన్నారు. ప్రతీ పైసను బ్యాంకుల్లో జమ చేసి రికార్డులు సక్రమంగా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌మోహన్, ఇబ్రహీంపట్నం, కందుకూరు డివిజన్ల పంచాయతీ అధికారులు సాధన, సామిరెడ్డి, యాచారం పంచాయతీ కార్యదర్శి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ రాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్లు జాన్‌వెస్లీ, నాగేశ్వర్‌రావు


