తాండూరు రూరల్: వర్షపు నీటి ప్రవాహాలను నిలిపి భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జలాలు పెంపొందించుకోవచ్చని కేంద్ర భూగర్భ జలాల నిర్వాహణ సంస్థ బోర్డు నోడల్ అధికారి డాక్టర్ ఎస్‌ఎస్ విఠల్ అన్నారు. సోమవారం ఆయన పెద్దేముల్ మండలం ఆత్కూర్, గొట్లపల్లి, జనగాం, బుద్దారం, సిద్దన్నమడుగుతండా, ఎర్రగడ్డ తండా గ్రామాల్లో వీబీజీ రామ్‌జీ కింద చేపట్టిన చెక్‌డ్యాం, రాతి కట్టలు, సోక్‌పిట్స్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాపు నీటిని సంరక్షించేందుకు కేంద్ర ప్రభు త్వం గుజరాత్ రాష్ట్రంలో 2024 సెప్టెంబర్ 6న జల్ సంచయ్ జన్ భగీదారి (జేఎస్‌జేబీ) పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగ స్వామ్యంతో దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ పథ కాన్ని ప్రజా ఉద్యమంగా చేపట్టామన్నారు. నీటి వనరుల రక్షణ ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, పరిశ్రమల భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాని సూచించారు.
గతేడాది పనులు పరిశీలన
పెద్దేముల్ మండలంలో గతేడాది వీబీజీరామ్‌జీ కింద గ్రామాల్లోని పొలాల్లో, అటవీ ప్రాంతాల్లో నిర్మించిన చెక్ డ్యాంలు, రాతి కట్టలు, సోక్‌పిట్స్, ఫారమ్ పాండ్స్‌లను పరిశీలించామన్నారు. ఆయన వెంట జిల్లా అడిషనల్ డీఆర్‌డీఓ సత్తయ్య, జిల్లా ఈసీ సైదులు, ఎంపీడీఓ తిరుమల స్వామి, ఎంపీఓ రతన్‌సింగ్, ఏపీఓ నర్సింలు, ఈసీ కృష్ణ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
పైకప్పు నీటి సంగ్రహణపై దృష్టి పెట్టండి
బషీరాబాద్: జల్ సంచయ్ జన్ భగీదారి(జేఎస్‌జేబీ) 2.0 కార్యక్రమంలో భాగంగా జల సంరక్షణ కోసం చేపట్టిన పనులను కేంద్ర భూగర్భ జలమండలి దక్షిణ ప్రాంతం సీనియర్ శాస్త్రవేత్త, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రధాన నోడల్ అధికారి డాక్టర్ ఎస్‌ఎస్ విఠల్ సోమవారం బషీరాబాద్ మండలంలో పరిశీలించారు. అదనపు డీఆర్‌డీఓ ఎం.సత్తయ్యతో కలిసి బషీరాబాద్, అల్లాపూర్, మాసంపల్లి, బాబూనాయక్ తండా, పర్వత్‌పల్లి, మంతట్టి గ్రామాల్లో చేపట్టిన వర్షపు నీటి సంరక్షణ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పైకప్పు వర్షపు నీటి సంగ్రహణ వ్యవస్థలు, ఫీడర్ కాల్వల పూడికతీత, ఊటకుంటలు, చెక్‌డ్యాంల పనులను పరిశీలించి అమలు తీరుపై అఽధికారులతో సమీక్షించారు. ప్రతీ పంచాయతీ భవనంపై పడే వర్షపునీటిని పైకప్పు సంగ్రహణ వ్యవస్థల ద్వారా భూగర్భంలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సర్పంచ్‌లకు సూచించారు. మండల ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, ఉపాధి హామీ పథకం అధికారులు, సాంకేతిక సహాయకులు, క్షేత్ర సహాయకులు, పంచా యతీ కార్యదర్శుల పనితీరును ప్రశంసించారు. కార్యక్రమంలో ఏపీఓలు శారద, నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు.
కేంద్ర భూగర్భ జలాల నిర్వహణ సంస్థ బోర్డు నోడల్ అధికారి డాక్టర్ విఠల్


