మెరుగైన వైద్య సేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన వైద్య సేవలు అందించాలి

Aug 25 2026 12:04 PM | Updated on Aug 25 2026 12:04 PM

పూడూరు: ప్రభుత్వ దవాఖానాలపై ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకుడు డాక్టర్‌ రవీందర్‌నాయక్‌ అన్నారు. సోమవారం ఆయన మన్నెగూడ ఆయుష్మాన్‌ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళా ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రతీ స్క్రీనింగ్‌ పరీక్షను విధిగా నిర్వహించాలని సూచించారు. అవసరమైన వారిని జిల్లా ఆస్పత్రికి రెఫర్‌ చేయాలని చెప్పారు. ఆస్పత్రి సిబ్బంది, వైద్యులు సమయపాలన పాటించాలన్నారు. విధుల్లో అలసత్వం వహించకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆస్పత్రిలో మందుల స్టోర్‌గది, లేబొరేటరీ గదు లను పరిశీలించారు. సీజనల్‌ వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడుతూ.. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధి కారి డాక్టర్‌ కె.సుధాకర్‌లాల్‌, జిల్లా పోగ్రాం అధికారి మహేశ్‌, చన్గోముల్‌ వైద్యాధికారి మహమూద్‌ ఫారూకీ, అజయ్‌, సిబ్బంది రవికుమార్‌, దాసు, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకుడు డాక్టర్‌ రవీందర్‌నాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement