అమెరికాలో ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఆత్మహత్య

Aug 25 2026 12:04 PM | Updated on Aug 25 2026 12:04 PM

మృతుడు దమ్మాయిగూడ శ్రీనివాస్‌నగర్‌ కాలనీవాసి

శోకసంద్రంలో తల్లిదండ్రులు

కీసర: చదువుకునేందుకు అమెరికా వెళ్లిన ఓ యువకుడు ప్రేమించిన యువతి దూరం కావడంతో ఆ బాధ తట్టుకోలేక ఈనెల 21న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి కుటుంబసభ్యులు, సన్నిహితులు తెలిపిన మేరకు.. మల్కాజిగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌ దమ్మాయిగూడలోని శ్రీనివాస్‌నగర్‌ కాలనీకి చెందిన కృష్ణ, విజయలక్ష్మి దంపతుల కుమారుడు సాయిప్రదీప్‌(29) 2024లో మాస్టర్స్‌ చదువు కోసం అమెరికా వెళ్లారు. టెక్సాస్‌లోని శాన్‌ ఆంటోనియోలో తన అన్న ప్రణీత్‌తో కలిసి ఉంటూ అండర్సన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ బిజినెస్‌ నుండి మూడు నెలల క్రితం మాస్టర్స్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అమెరికాలో పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేస్తూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో ఉంటున్న సిద్ధిపేటకు చెందిన యువతిని ప్రదీప్‌ 9 నెలల పాటు ప్రేమించారు. ఇద్దరూ వివాహం చేసుకో వాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయాన్ని సాయి ప్రదీప్‌ తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. ముందు తల్లిదండ్రులు అంగీకరించకపోయినా చివరకు ఒప్పుకొన్నారు. ఇంతలోనే ప్రేమించిన యువతి దూరంగా ఉంటోంది. సున్నిత మనస్తత్వం కలిగిన ప్రదీప్‌ ఇది తట్టుకోలేక మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 21న ప్రేయసికి దాదాపు పది సార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదు. తను చేస్తున్న జాబ్‌ బాధ్యతలను రెండు గంటల పాటు నిర్వర్తించాలని అన్నకు అప్పగించారు. ఆ తరువాత ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ ఘటన గురించి తల్లిదండ్రులకు ప్రణీత్‌ తెలిపారు. ప్రేయసి దూరం కావడంతోనే తమ్ముడు ప్రదీప్‌ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడని.. ఆమైపె చర్యలు తీసుకోవాలని అమెరికాలో పోలీసులకు ప్రణీత్‌ ఫిర్యాదు చేశారని మృతుని తండ్రి కృష్ణ తెలిపారు. మృతదేహాన్ని ఈ నెలాఖరులోపు తెప్పించేందుకు ప్రయత్నిస్తు న్నారు. ఇదిలా ఉండగా ప్రదీప్‌కు చిన్నతనంలోనే కిడ్నీ సమస్య ఉండటంతో ఒక కిడ్నీని వైద్యులు తొలగించారు. సాయిప్రదీప్‌ తల్లిదండ్రులను కాంగ్రెస్‌ పార్టీ దమ్మాయిగూడ డివిజన్‌ అధ్యక్షుడు రామారావు, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ మాదిరెడ్డి నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత హరిగౌడ్‌ తదితరులు పరామర్శించి ధైర్యం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement