యాచారం: కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయిన సంఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ.. తాడిపర్తి గ్రామానికి చెందిన దార రామచంద్రమ్మ, సాయిలు దంపతులు. కుమార్తె మంజుల (33) వ్యవహారశైలిపై ఇటీవల కుటుంబసభ్యులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఈనెల 21న ఇంటి నుంచి వెళ్లింది. బంధువుల ఇళ్ల వద్ద వెతికినా జాడ తెలియకపోవడంతో తల్లి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మానసికస్థితి సరిగా లేని యువకుడు..
మాడ్గుల: మానసికస్థితి సరిగా లేని యువకుడు అదృశ్యమైన సంఘటన మాడ్గుల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వేణుగోపాలరావు కథనం ప్రకారం.. మండల పరిఽధిలోని కాట్రావ్‌తండాకు చెందిన కాట్రావత్ గోవర్ధన్ (20) పదో తరగతి పూర్తి చేశాడు. మానసిక స్థితి సరిగాలేకపోవడంతో ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. ఈనెల 23న సాయంత్రం నాగిళ్ల గ్రామానికి వెళ్లి కటింగ్ చేసుకొని వస్తానని చెప్పి బైక్‌పై వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తల్లి కాట్రావత్ బుజ్జి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఓగిపూర్ గనుల్లో విచారణ
తాండూరు రూరల్: మండల పరిధిలోని ఓగిపూర్ శివారులో ఉన్న నాపరాతి గనుల్లో మైనింగ్ అధికారులు విచారణ చేపట్టారు. సోమవారం మైనింగ్ శాఖ ఆర్‌ఐ నిర్మళ, సర్వేయర్ లక్ష్మీనారాయణ క్షేత్రస్థాయిలో గనుల్లోకి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓగిపూర్ నాపరాతి గనుల్లో 51, 52, 55 సర్వే నంబర్లలో మైనింగ్ లీజు ముగిసినప్పటికీ పలువురు నాపరాతి తవ్వకాలు జరుపుతున్నారని లోకాయుక్తలో ఫిర్యాదు చేశారన్నారు. లోకాయుక్త ఆదేశాల మేరకు వ్యాపారులతో మాట్లాడి లీజుకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీ లించామన్నారు. గడువు ముగిసినప్పటికీ తవ్వకాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నివేదికను మైనింగ్ ఏడీకి సమర్పి స్తామని అధికారులు తెలిపారు. మండలంలోని ఓగిపూర్, మల్కాపూర్, కరన్‌కోట్, కోటబాసుపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతున్న సంబంధిత మైనింగ్ అధికారులు పట్టించుకోక పోవడంతో బాధితులు లోకాయుక్తను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది.


