కేశంపేట: జిల్లాలోని ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌గౌడ్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం విద్యార్థులతో కలిసి హర్‌ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. జాతీయ జెండా దేశ గౌరవం, ఐక్యత, సమగ్రతకు ప్రతీక అన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, హర్‌ఘర్ తిరంగా మండల కన్వీనర్లు కానం ఉదయ్‌కుమార్‌గౌడ్, కంచుకోట మహేశ్, బీజేపీ జిల్లా కోశాధికారి నరసింహగౌడ్, వంశీకృష్ణ, పార్టీ మండల అధ్యక్షురాలు రాధిక, సుధాకర్‌రావు, పసుల నర్సింహయాదవ్, సాయి తదితరులు పాల్గొన్నారు.


