అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు సకాలంలో పూర్తిచేయాలి

Aug 15 2026 7:29 AM | Updated on Aug 15 2026 7:29 AM

ఆమనగల్లు: మున్సిపాలిటీలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ డా.కిరణ్మయి కొప్పిశెట్టి అన్నారు. పట్టణంలో గురువారం పర్యటించిన ఆమె మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు స్కూల్‌ విద్యార్థులకు కుడుతున్న యూనిఫాంల నాణ్యతను పరిశీలించారు. సురసముద్రం చెరువు వద్ద అర్బన్‌ చాలెంజ్‌ఫండ్‌ పథకం కింద చేపట్టే పనులపై అధికారులతో మాట్లాడారు. అమృత్‌ పథకంలో చేపట్టిన వాటర్‌ట్యాంకుల నిర్మాణం, పైప్‌లైన్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. అమృత్‌పథకం పనులను డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం బస్టాండ్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాంను పంపిణీ చేశారు. అంతకుముందు మున్సిపల్‌ కార్యాలయం వద్ద అదనపు కలెక్టర్‌కు చైర్మన్‌ పత్యానాయక్‌, వైస్‌ చైర్మన్‌ గీత ఆచారి, మున్సిపల్‌ కమిషనర్‌ రాఘవేందర్‌రెడ్డి స్వాగతం పలికారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మేనేజర్‌ ఆంజనేయులు, ఏఈ నరేశ్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ తదితరులు ఉన్నారు.

అదనపు కలెక్టర్‌ కిరణ్మయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement