కఠిన చర్యలు లేకపోవడమూ..
గుప్త నిధుల పేరుతో .. ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని నమ్మించి రూ.7.5 లక్షలతో ఉడాయించిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో ‘నిషా’చరులు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి యమ‘డ్రింకరులు’ మృత్యుశకటాలపై అడ్డూ అదుపు లేకుండా తిరుగుతూ అమాయకుల బతుకుల్లో చీకట్లు నింపుతున్నారు. సోమవారం తెల్లవారుజామున నార్సింగి, బాలాపూర్, మాదాపూర్ పోలీసుస్టేషన్ల పరిధిలో జరిగిన మూడు ప్రమాదాల్లో మాజీ జవాన్, మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోగా పలువురు క్షతగాత్రులయ్యారు. అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. రికార్డుల్లోకి ఎక్కని ఇలాంటి ఉదంతాలు నిత్యం ఎన్నో ఉంటున్నాయి. ఈ మందుబాబుల్ని కట్టడి చేయడంలో ప్రభుత్వ విభాగాలు ఆశించిన ఫలితాలు సాధించడం లేదు.
అది మూడో కేటగిరీ వైలేషన్..
ట్రాఫిక్ ఉల్లంఘనల్ని తీవ్రత ఆధారంగా మూడు రకాలుగా విభజించారు. వాహనం నడిపే వ్యక్తికి ప్రమాదమైతే మొదటి.. ఎదుటి వారికి జరిగితే రెండోదిగా పరిగణిస్తారు. వాహనం నడిపే వ్యక్తితో పాటు ఎదుటి వారికీ ప్రమాదం జరిగితే తీవ్రమైన మూడో కేటగిరీలోకి చేరుస్తారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడం వంటివి మొదటి కేటగిరీలో ఉంటే డ్రంకెన్ డ్రైవింగ్, రాంగ్‌రూట్ తదితరాలు మూడో కేటగిరీలోకి వస్తాయి.
నిరూపించడమూ సవాలే..
మద్యం మత్తులో ప్రమాదాలు చేసిన కేసుల్లో ‘నిరూపణలు’ కష్టసాధ్యంగా మారుతున్నాయి. ఘటనా స్థలంలో నిందితులు దొరికితే బ్రీత్ అనలైజర్ల ద్వారా శ్వాస పరీక్షలు చేసి.. మద్యం తాగినట్లు నిరూపించడానికి ఆస్కారం ఉంటుంది. కొన్నిసార్లు నిందితులు ఘటనా స్థలి నుంచి పారిపోతున్నారు. వీరు చిక్కేటప్పటికి 24 నుంచి 48 గంటలు గడిచిపోతున్నాయి. దీంతో సదరు వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని నిరూపించడం గగనంగా మారుతోంది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాద స్థలికి వెళ్లేది, కేసుల్ని దర్యాప్తు చేసేది శాంతిభద్రతల విభాగం పోలీసులు కాగా.. డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో చర్యలు తీసుకొనేది ట్రాఫిక్ పోలీసులు కావడం గమనార్హం. వీరి మధ్య సమన్వయ లోపం అనేక ఇబ్బందులకు కారణమవుతోంది.
ఎస్‌ఓపీ లేక మరిన్ని ఇబ్బందులు
ఈ తరహా కేసుల నమోదు, దర్యాప్తులోనూ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ) లేకపోవడం సైతం మందుబాబులకు అనుకూలంగా మారుతోంది. ఈ కారణంగానే పోలీసులు ఒక్కో కేసును ఒక్కో రకంగా నమోదు చేయడంతో పాటు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని ప్రమాదాల్లో వాహనంలో ఉన్న వారంతా మద్యం తాగినప్పటికీ... కేవలం వాహనం నడిపిన వ్యక్తిపై మాత్రమే కేసు నమోదు చేస్తున్నారు. మరికొన్నింటిలో డ్రైవింగ్ చేసిన వ్యక్తితో పాటు వాహనంలో ఉన్న ఇతరులనూ అరెస్టు చేస్తున్నారు. ఈ కేసుల నమోదు, దర్యాప్తులు ఒక్కో కమిషనరేట్‌లో ఒక్కో రకంగా ఉంటున్నాయి.
రాజధానిలో డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఇలా..
ఏడాది హైదరాబాద్ సైబరాబాద్ మల్కాజ్‌గిరి
2023 37,866 52,124 16,594
2024 59,572 18,959 15,390
2025 49,732 15,706 17,760
అర్ధరాత్రి వాహనాలతో రోడ్లపై రెచ్చిపోతూ..
అమాయకుల ప్రాణాలు తీస్తున్న ‘నిషా’చరులు
ఒకే రోజు మూడో చోట్ల ప్రమాదాలు
ఇద్దరి మృతి..పలువురికి గాయాలు
మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ చిక్కిన వారిపై కఠిన చర్యలు లేకపోవడం సైతం ‘నిషా’చరులు పెరగడానికి ఓ కారణంగా మారుతోంది. డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కిన వారి వాహనాలు స్వాధీనం చేసుకునే విధానం ఉండేది. న్యాయస్థానం ఆదేశాల మేరకు దీనికి బ్రేక్ పడింది. చలాన్ జారీ చేసి కోర్టులో హాజరుకావాల్సిందిగా ఆదేశిస్తున్నారు. నిందితులకు జైలుశిక్షలు, జరిమానాలు పెంచడం, డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయడం, కుటుంబీకులకూ కౌన్సెలింగ్ చేయడం, మందుబాబుల డేటాబేస్‌ను అనుసంధానించడం తదితర కఠిన చర్యలు తీసుకుంటేనే ఫలితాలు ఉంటాయన్న వాదన బలంగా వినిపిస్తోంది.


