క్విట్‌ ఇండియా స్ఫూర్తితో పోరాడుదాం | - | Sakshi
Sakshi News home page

క్విట్‌ ఇండియా స్ఫూర్తితో పోరాడుదాం

Aug 11 2026 7:15 AM | Updated on Aug 11 2026 7:15 AM

ఇబ్రహీంపట్నం: పేదలు, కార్మికులు, కర్షకుల సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య విమర్శించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని రైతు వ్యవసాయ, సీఐటీయూ సంఘాల దేశవ్యాప్త పిలుపు మేరకు సోమవారం జైల్‌భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. సాగర్‌ రహదారిపై బైఠాయించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్‌శక్తులు, మతోన్మాదం నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు క్విట్‌ ఇండియా స్ఫూర్తితో తెగించి పోరాడాలని పిలుపునిచ్చారు. అందుకు జైలుకై నా వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు సామేల్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రుద్రకుమార్‌, ఉపాధ్యక్షుడు కిషన్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాంచందర్‌, ఉపాధ్యక్షుడు ముసలయ్య, సహాయ కార్యదర్శి బుగ్గరాములు, కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య, కార్యదర్శి కె.జగన్‌, ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షురాలు శారద, కార్యదర్శి గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి యాదయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement