జీఓ 641 రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

జీఓ 641 రద్దు చేయాలి

Jul 16 2026 7:24 AM | Updated on Jul 16 2026 7:24 AM

తండాలను డంప్‌యార్డ్‌లుగా మారిస్తే ఊరుకోం

ఎల్‌హెచ్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్‌నాయక్‌

కొత్తూరు: వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజన తండాల్లో ప్రభుత్వం డంపింగ్‌యార్డులు ఏర్పాటు చేయొద్దని ఎల్‌హెచ్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాల్‌నాయక్‌ అన్నారు. బుధవారం సిద్ధాపూర్‌లో డంప్‌యార్డు రద్దు కోసం ఇన్ముల్‌నర్వలో ఎల్‌హెచ్‌పీఎస్‌ అనుబంధంగా డంప్‌యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మిట్టునాయక్‌, సలహాదారులుగా రాంబాల్‌, రాజునాయక్‌, ఉపాధ్యక్షులుగా రాంచందర్‌నాయక్‌, రూప్లానాయక్‌ ప్రధానకార్యదర్శిగా బిచ్యానాయక్‌ను ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డంప్‌యార్డు ప్రతిపాదిత స్థలానికి చేరువలో పదుల సంఖ్యలో గిరిజన తండాలున్నాయన్నారు. డంప్‌యార్డు ఏర్పాటుతో పొలాలు, చెరువులు, కలుషితమవడం, తండాల్లో నివసించే పరిస్థితి ఉండదన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని జీఓ 641 రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఎల్‌హెచ్‌పీఎస్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్‌ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. జేఏసీ ఆధ్వర్యంలో డంప్‌యార్డుకు వ్యతిరేకంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి ఇన్ముల్‌నర్వలో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్‌, శేఖర్‌రెడ్డి, రవికుమార్‌, ఖాజా, సిరాజ్‌, శంకర్‌, గోపాల్‌, లక్ష్మణ్‌, కమిటీ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement