డ్రోన్ల వినియోగం నిషేధం | - | Sakshi
Sakshi News home page

డ్రోన్ల వినియోగం నిషేధం

Jul 15 2026 12:05 PM | Updated on Jul 15 2026 12:05 PM

డ్రోన్ల వినియోగం నిషేధం గడువులోగా సర్‌ ప్రక్రియ పూర్తి చేయండి ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలిగా మంజుల ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పరిశీలన

తుక్కుగూడ: గ్రీన్‌ఫార్మా సిటీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో డ్రోన్లు, పారాగ్లైడర్లు, రిమోట్‌ కంట్రోల్డ్‌ మైక్రో–లైట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ల వినియోగం పూర్తిగా నిషేధించినట్టు ఫ్యూచర్‌ సిటీ కమిషనర్‌ తరుణ్‌జోషి తెలిపారు. తుక్కుగూడ పట్టణ పరిధి, ఈ–సిటీలోని ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫ్యూచర్‌ సిటీ పర్యటన సందర్భంగా భద్రతాపరమైన కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారి పై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు తప్పనిసరి పాటించి పోలీస్‌ శాఖకు సహకరించాలని సూచించారు.

తుర్కయంజాల్‌: సర్‌ ప్రక్రియను ఈ నెల 24వ తేదీ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని జిల్లా చీఫ్‌ ప్లానింగ్‌ అధికారి పి.సౌమ్య సూచించారు. ఆదిభట్ల సర్కిల్‌ పరిధిలోని రాగన్నగూడ, ఇంజాపూర్‌లో సర్‌ ప్రక్రియను మంగళవారం ఆమె పరిశీలించారు. స్పెషల్‌ ఆఫీసర్‌లు, బీఎల్‌ఓలు, సూపర్‌ వైజర్లతో చర్చించారు. ప్రక్రియను వేగవంతం చేసి, ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్‌ ఫారాలు తీసుకోవాలని, సేకరించిన వాటిని డిజిటలైజేషన్‌ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీసీ, ఏఈఆర్‌ఓ సత్యనారాయణ రెడ్డి, ఏఎంసీ శ్రీనివాసులు, ఎస్‌డబ్ల్యూఎం డీఈఈ స్వర్ణకుమార్‌, ఏఈ యోగేంధర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చేవెళ్ల: భారతీయ జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) జిల్లా అధ్యక్షురాలిగా చేవెళ్లకు చెందిన వడ్ల మంజుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజేంద్రనగర్‌లోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం జరిగిన జిల్లా మహాసభల్లో ఎన్నికను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజంలో మహిళల విషయంలో జరుగుతున్న వివక్షతపై పోరాటాలు నిర్వహిస్తామని, అభ్యున్నతికి పాటుపడతామని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు, రామస్వామి తదితరులకు కృతజ్ఞ తలు తెలిపారు.

పహాడీషరీఫ్‌: జీహెచ్‌ఎంసీ జల్‌పల్లి డివిజన్‌లో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను బీజేపీ రాజ్యసభ సభ్యురాలు, పార్టీ జాతీయ కార్యదర్శి అల్కాసింగ్‌ గుర్జార్‌ మంగళవారం పరిశీలించారు. పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్క్‌ను మాజీ మంత్రి, ఎస్‌ఐఆర్‌ బీజేపీ జోనల్‌ ఇన్‌చార్జి మర్రి శశిధర్‌ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్‌, జిల్లా అధ్యక్షుడు రాజ్‌భూపాల్‌ గౌడ్‌, మహేశ్వరం ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్‌తో కలిసి ఫారాల పంపిణీ, స్వీకరణ, ఫారాలు నింపడంలో ఓటర్లకు ఎదురవుతున్న సందేహాల విషయమై ఆరా తీశారు. క్యాక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కొప్పు భాష, తూట్పల్లి రవి, జిల్లా ఎస్‌ఐఆర్‌ కన్వీనర్‌ మల్లారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ బీఎల్‌ఏ–1 అంబోజి శ్రీనివాస్‌, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కపిల్‌ గౌడ్‌, స్థానిక అధ్యక్షుడు మనోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement