‘లక్ష్మీదేవిపల్లి’ భూ సర్వే త్వరగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘లక్ష్మీదేవిపల్లి’ భూ సర్వే త్వరగా పూర్తి చేయాలి

Jul 15 2026 12:05 PM | Updated on Jul 15 2026 12:05 PM

కొందుర్గు: మూడు రోజుల్లో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు సంబంధించిన భూముల సర్వే పనులు పూర్తి చేయాలని అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రారెడ్డి సూచించారు. జిల్లేడ్‌ చౌదరిగూడ మండలపరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ఆయన కొందుర్గు, జిల్లేడ్‌ చౌదరిగూడ మండలాలకు సంబంధించిన వివిద శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా పద్మారం గ్రామ శివారులో 265 ఎకరాల భూములను కేటాయించడం జరిగిందని, మూడురోజుల్లో సర్వే పనులు పూర్తిచేసి ఎంజాయ్‌మెంట్‌ వివరాలు సిద్ధం చేయాలన్నారు. గ్రీన్‌ఫీల్డ్‌ రేడియల్‌ రోడ్డుకు సంబంధించి భూములు కోల్పోతున్న రైతుల్లో ఇంకా ఎవరైనా అంగీకారపత్రాలు ఇవ్వకుంటే వారికి అవగాహన కల్పించి అంగీకారపత్రాలు ఇచ్చేలా చూడాలన్నారు. కొందుర్గు, జిల్లేడ్‌ చౌదరిగూడ మండలాల్లో వేగవంతంగా ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ చేయించాలని, ఏఒక్క రైతు మిగిలిపోకుండా చూడాలన్నారు. భూభారతి సమస్యలు వెంటనే పరిష్కరించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఏమైనా పరిష్కారం కాని సమస్యలుంటే తన దృష్టికి తేవాలని తహసీల్దార్లకు సూచించారు. సర్‌ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని, అర్హులైన ఓటర్లు ఏఒక్కరి ఓటు పోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో తహసీల్దార్‌లు జగదీశ్వర్‌, ఆజాంఅలీ, డీటీలు భాస్కర్‌, నివేదిత రెడ్డి, ఏఓ రాజేందర్‌ రెడ్డి, ఇరిగేషన్‌, సర్వే అధికారులు పాల్గొన్నారు.

పాఠశాలకు విరాళం

జిల్లేడ్‌ చౌదరిగూడ మండలం పెద్దఎల్కిచర్ల ఉన్నత పాఠశాలకు అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రారెడ్డి రూ.లక్ష విరాళం అందజేశారు. పాఠశాల ఖాతాలో ఆ మొత్తాన్ని డిపాజిట్‌ చేసి పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పురస్కారాలు అందజేయాలని సూచించారు.

అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement