వైద్య సేవలు మెరుగుపర్చడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

వైద్య సేవలు మెరుగుపర్చడమే లక్ష్యం

Jul 15 2026 12:05 PM | Updated on Jul 15 2026 12:05 PM

తుర్కయంజాల్‌: అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చడమే ప్రభుత్వ లక్ష్యం అని నేషనల్‌ క్వాలిటీ ఆడిటర్‌ ఫయాజ్‌ షేక్‌ అన్నారు. ఎల్బీనగర్‌, హయత్‌నగర్‌, ఇంజాపూర్‌ కేంద్రాల్లోని 108, 102, నియోనటల్‌ అంబులెన్స్‌ సేవలపై మంగళవారం నేషనల్‌ క్వాలిటీ ఆడిట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అంబులెన్స్‌లో ఉన్న ఆక్సిజన్‌ సిలిండర్లు, సెక్షన్‌ యంత్రాలు, పేషెంట్‌ మానిటర్లు, స్ట్రెచర్లు తదితర అత్యవసర వైద్య పరికరాల పనితీరును పరిశీలించారు. మందుల నిల్వలు, గడువు తేదీలు, స్టాక్‌ రిజిస్టర్‌, కాల్‌ లాగ్‌ బుక్స్‌ వంటి రికార్డులను తనఖీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందిస్తున్నారా లేదా అనే వివరాలు తెలుసుకున్నారు. జిల్లా మేనేజర్‌ రాంబాబు మాట్లాడుతూ.. 108 సేవల ప్రమాణాలను మరింత పెంచేందుకు ఇలాంటి నాణ్యతా తనిఖీలు ఉపయోగపడతాయని అన్నారు. కార్యక్రమంలో టెక్నీషియన్లు సురేష్‌, రఘు, కృష్ణ, పైలట్‌లు రవి కుమార్‌, లక్ష్మీకాంత్‌ రెడ్డి, కృష్ణ, నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement