శంషాబాద్: వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలోని మూడు మృతదేహాలు మంగళవారం ఉదయం ముంబై నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. మచిలీపట్నానికి చెందిన జయశ్రీ, కడపకు చెందిన శ్రీధర్, హిందూపూర్‌కు చెందిన రవితేజ మృతదేహాలను శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లలో వారి స్వస్థలాలకు తీసుకెళ్లారు. ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తోపాటు పలువురు అధికారులు వచ్చి పరిస్థితిని సమీక్షించి దగ్గరుండి వాటిని స్వస్థలాలకు పంపించారు.
కుత్బుల్లాపూర్: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మంగళవారం ఉదయం సుచిత్ర నుంచి తిరుమలగిరి వైపు బైక్‌పై వెళ్తున్న సత్యదేవ ప్రసాద్, దుష్యంత్ (31)లను మై ఫ్రెండ్స్ సర్కిల్ రెస్టారెంట్ యూ టర్న్ వద్ద ఐషర్ వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన దుష్యంత్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. బైక్ నడుపుతున్న సత్యదైవ ప్రసాద్ చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తులో ఉంది.


