షాబాద్: సర్వే నంబర్ 311 రైతులకు త్వరలోనే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని తహసీల్దార్ ఎండీ అన్వర్ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతుల సందేహాలను విని, సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు గుండాల అశోక్, కుమ్మరి లావణ్య చెన్నయ్య, పోనమోని శ్రీశైలం, ముద్దెంగూడ మాజీ ఎంపీటీసీ కుమ్మరి చెన్నయ్య, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు.


