ఆమనగల్లు: తెలంగాణ నాయీబ్రాహ్మణ సేవాసంఘం రాష్ట్ర సమన్వయ కమిటీ చైర్మన్‌గా తలకొండపల్లి మండలం వెంకట్రావ్‌పేట గ్రామానికి చెందిన కానుగుల దశరథం నియమితులయ్యారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ నాయీబ్రాహ్మణ సేవాసంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నూతనంగా రాష్ట్ర సమన్వయ కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ చైర్మన్‌గా కానుగుల దశరథం, వైస్ చైర్మన్‌గా మహేశ్వరి, సభ్యులుగా విజయ్ సాయి, సుదర్శన్, ప్రేమ్‌దాస్, కోట్ల రామకృష్ణ, శ్రీను, రమేశ్, రాములు, అనసూయను నియమించారు.


