క్రేన్‌ ఢీకొని కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

క్రేన్‌ ఢీకొని కూలీ మృతి

Jul 15 2026 12:05 PM | Updated on Jul 15 2026 12:05 PM

మీర్‌పేట: క్రేన్‌ ఢీకొని కూలీ (యువకుడు) మృతి చెందిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ శోభన్‌ కథనం ప్రకారం.. బాలాపూర్‌కు చెందిన భీమియాల బాలయ్య కుమారుడు చిన్నా (22) కూలి పనులు చేస్తుంటాడు. రెండేళ్లుగా కందుకూరు మండలం లేమూరు గ్రామంలో ఉండే అక్క పద్మ వద్ద ఉంటున్నాడు. వారం రోజుల క్రితం బాలాపూర్‌లో ఉండే తండ్రిని చూసి వస్తానని వచ్చాడు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు పని నిమిత్తం బాలాపూర్‌ చౌరస్తాకు వచ్చి టీ తాగి రోడ్డు దాటుతుండగా మల్లాపూర్‌ నుంచి వేగంగా వస్తున్న క్రేన్‌ (టీజీ11 బీ 3130) ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో అతన్ని స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలింగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. క్రేన్‌ డ్రైవర్‌ అతివేగం, అజాగ్రత్తగా నడపడంతోనే ప్రమా దం జరిగిందని, అతనిపై చర్యలు తీసుకోవా లని మృతుడి సోదరి పద్మ పోలీసులకు ఫిర్యా దు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

పేకాట స్థావరంపై

ఎస్‌ఓటీ దాడులు

పరిగి: పరిగి మార్కెట్‌ కమిటీ దుకాణ సముదాయం పేకాట స్థావరంగా మారింది. మంగళవారం ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించి నలుగురు పేకాటరాయుళ్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.13,600 నగదు, నాలుగు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. కొంత కాలంగా మార్కెట్‌ కమిటీ సముదాయంలో పేకాట నడుస్తున్నట్లు స్థానికులు ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం గురించి స్థానిక ఎస్సై మోహనకృష్ణను వివరణ కోరగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

18 ట్రాక్టర్ల ఇసుక సీజ్‌

బొంరాస్‌పేట: మండలంలోని మహంతీపూర్‌ సమీపంలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్‌లను మంగళవారం రెవెన్యూ అధికా రులు సీజ్‌ చేశారు. దాదాపు 18 ట్రాక్టర్ల ఇసుకను సీజ్‌ చేశామని, బుధవారం ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ శిరీష తెలిపారు.

రెండు ఇసుక ట్రాక్టర్ల సీజ్‌

తాండూరు రూరల్‌: అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. కరన్‌కోట్‌ ఎస్‌ఐ రాథోడ్‌ వినోద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గోనూర్‌ – వీర్‌శెట్టిపల్లి వాగులో నుంచి మంగళవారం వీర్‌శెట్టిపల్లికి చెందిన చీమల హారిష్‌, శంక ర్‌కు ఇసుక తరలిస్తున్నారు. ఎలాంటి పర్మిషన్‌ లేక పోవడంతో ట్రాక్టర్లను టాస్క్‌ఫోర్ట్‌ పోలీసులు సీజ్‌ చేసి కరన్‌కోట్‌ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేయనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేత

బొంరాస్‌పేట: మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లికి చెందిన ఏడాదిన్నర వయసుగల సానియా అనారోగ్యంతో ఉండగా కుటుంబానికి మంగళవారం సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేశారు. చిన్నారి సానియా తాతయ్య బాబుమియాకు రూ.లక్ష చెక్కును అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement